నవతెలంగాణ-హైదరాబాద్: 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థికవ్యవస్థ 7.8శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. గతేడాది 7.4శాతం కన్నా పెరిగినట్లు కేంద్రం శుక్రవారం తెలిపింది. నూతన జిఎస్‌టి సిరీస్ ప్రకారం ఆర్థిక అంచనాల కోసం 2022-23ని బేసిక్ ఇయర్‌గా తీసుకున్నట్లు తెలిపింది. గతంలో ఇది 2011-12గా ఉండేది.
నూతన సిరీస్ ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 7.6శాతంగా అంచనా వేసినట్లు గణాంకాల మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జనవరిలో అంచనా విడుదలైన అంచనాల ప్రకారం.. ఇది 7.4శాతంగా ఉంది. 2025-26 జులై-సెప్టెంబర్ కాలానికి వృద్ధి రేటును 8.2శాతం నుండి 8.4శాతానికి పెంచారు. అయితే మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటును 7.8శాతం నుండి 7.6శాతానికి తగ్గించారు.
దేశ ఆర్థికవ్యవస్థ 7.8శాతం వృద్ధి రేటు
- Advertisement -
- Advertisement -



