- ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించిన నూడా చైర్మన్ కేశ వేణు
నవతెలంగాణ-కంఠేశ్వర్: ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ కేంద్రలోని ఆర్ఆర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నగర కమిటీ అధ్యక్షులు మల్లమారి సుధాకర్ ఆధ్వర్యంలో నూడా చైర్మన్ కేశ వేణు ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ.. మాదిగల రిజర్వేషన్ల సాధన కోసం ఏర్పడిన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల,ప్రజలకు, సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాదిగలు సామాజిక ,ఆర్థిక, రాజకీయ అవకాశాల కోసం చేసిన పోరాటాలను గత బిఆర్ఎస్ పాలకులు పూర్తిగా విస్మరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి చిత్తశుద్ధిగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని అన్నారు.
అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గ నాయకులకు మంత్రివర్గం లో రాజకీయ ప్రాధాన్యత కల్పించి, మాదిగలను అక్కున చేర్చుకున్నారని అన్నారు. సామాజిక ఫలాలు అణగారిన వర్గాలకు అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం కలుగుతుందన్నారు. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పార్థసారథి, కొండపాక రాజేష్, మల్యాల గోవర్ధన్, కృష్ణ, తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలోనిజామాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్, టౌన్ అధ్యక్షులు నల్లమల సుధాకర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సినిమాల పోసాని, జిల్లా జనరల్ సెక్రెటరీ సామెల్, టౌన్ యువసేన అధ్యక్షులు చిరు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కవిత, గంగామణి సాయికుమార్, రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు సలేంద్ర బాబురావు తదితరులు పాల్గొన్నారు.
