నవతెలంగాణ- దుబ్బాక
ఆదివారం రాత్రి కురిసిన భారీ గాలివానతో దుబ్బాక మున్సిపల్ కేంద్రంతో పాటు పలు వార్డులు, మండల పరిధిలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి కరెంటు స్తంభాలపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 9 వ వార్డుకు చెందిన జనగామ చంద్రం ఇంటిపై చెట్టు విరిగి పడటంతో కూలి పని చేసుకుంటూ బ్రతికే ఆ పేదోడి గూడు కూలిపోయింది. అతనికున్న చిన్నపాటి ఇంటిపై పెద్ద వేప చెట్టు పడడంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రం తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దుబ్బాక తహసీల్దార్ ఈ.సంజీవ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ హరికిషన్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మండలంలోని హబ్సిపూర్ పిట్టల వాడలో 7 గుడిసెలు పాక్షికంగా ధ్వంసం అయినట్లు ఎమ్మార్వో సంజీవ్ కుమార్ తెలిపారు.
గాలివాన తెచ్చిన నష్టం.. కూలిన పేదోడి గూడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES