నవతెలంగాణ-హైదరాబాద్: పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నూతన పోప్ ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మే 7న జరిగే తుది కార్డెనల్స్ ఎన్నికల్లో కొత్త పొప్ ఎవరు అనేది తెలియనుంది. కార్డినల్స్ వాటికన్ సైనాడ్ హాల్‌లో జరిగే ఐదో జనరల్ కాంగ్రిగేషన్‌లో సమావేశంలో కొత్త పోప్ పేరును ప్రకటించనున్నారు. 133మందికి 120 మంది కాలేజ్ ఆప్ కార్డెనల్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. ఈ కొత్త పోప్ ఎన్నికల్లో 80ఏళ్లలోపు కార్డెనల్స్ మాత్రమే పాల్గొంటారు. దీంతో సంఖ్య తగ్గిందని వాటికన్ అధికారులు తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ మారణాంతరం ఈ కొత్త పోప్ ఎన్నికల ప్రక్రియ 15 రోజలపాటు సాగింది. నూతన పోప్ రేసులో పలువురు పేర్లు ప్రధానంగా వినికిడిలో ఉన్నాయి. కార్డినల్ పీట్రో పరోలిన్, కార్డినల్ పీటర్ టర్క్‌సన్, కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే, కార్డినల్ పీటర్ ఎర్డో, కార్డినల్ మైకోలా బైచోక్‌లు రేసులో ఉన్నారు. వీరిలో నూతన పోప్ ఎవరూనేది వచ్చే నెల మే7 తెలనుంది.
కొత్త పోప్ పేరు ప్రకటనకు ముహూర్తం ఖరారు
- Advertisement -
RELATED ARTICLES