Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న గ‌డువు..ఎప్పుడంటే..?

ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న గ‌డువు..ఎప్పుడంటే..?

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్‌ కేంద్రాల వద్ద అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్‌డేట్‌ చేసుకోవాలి. రెగ్యులర్ అప్‌డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -