Wednesday, April 30, 2025
Homeజిల్లాలుపర్యాటకుల మృతి బాధాకరం.!

పర్యాటకుల మృతి బాధాకరం.!

  • జీపీ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
    నవతెలంగాణ – మల్హర్ రావు
    : జమ్ము కాస్మిర్ పర్యాటకుల మృతి చాలా బాధాకరమని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు తోట కుమార్ అన్నారు.ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ కాజా పిలుపు మేరకు సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన యాత్రికులకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,నివాళులర్పించారు.ఈ సందర్భంగా  మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగానే పాకిస్తాన్ తీవ్రవాదులు జమ్మూకాశ్మీరు పై విరుచుకుపడి అమాయకులైన యాత్రికులను కాల్చి చంపడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటివి పునరాకృతం  కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ చర్యకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమరులైన పౌరులకు నివాళులు అర్పిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు.పహల్గాం ఉగ్రవాద దాడిలో తెలంగాణ వాసి, ఐబీ అధికారి మనీష్ రంజన్ మరియు మృతి చెందిన 28 మంది పట్ల విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నానోతు తిరుపతి, మండల ఇంచార్జి ఇప్ప రవిందర్,సమ్మయ్య,పెంటయ్య,మల్లయ్య,రాజబాపు,శ్రీను,అశోక్,మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img