Friday, January 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగ్రామాల అభివృద్దే దేశ అభివృద్ధి…

గ్రామాల అభివృద్దే దేశ అభివృద్ధి…

- Advertisement -

సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి  జహంగీర్ అన్నారు. శుక్రవారం  భువనగిరిలోని సుందరయ్య భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన నిర్వహించడగా, ఈ సమావేశానికి  ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్ హాజరై మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి చెందుతుందని, గత రెండు సంవత్సరాల నుంచి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించక పోవడం గ్రామ పాలన అధికారి సర్పంచ్ లేకపోవడం వల్ల అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొందని, గ్రామాల పరిపాలన అధికారిగా నియమించిన గాని గ్రామాలకు అభివృద్ధి ఆమడ దూరంలో ఉండిపోయిందని, ప్రభుత్వం  గ్రామపంచాయతీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు ఐదు లక్షలు చొప్పున విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలనిఅన్నారు. కేరళ రాష్ట్రం తరహా గ్రామాల అభివృద్ధి వైపు ఉండాలని అన్నారు,మన రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి వైపు  ఆమడ దూరంలో  ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా గ్రామాలకు అధిక నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ఉండాలని అన్నారు, విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని అదేవిధంగా గతంలో ప్రారంభించిన పనులను పున ప్రారంభించాలన్నారు, గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య మండల కార్యవర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, అన్నం పట్ల, కృష్ణ , కొండ అశోక్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు  మోటే ఎల్లయ్య, మద్దెపురం బాల నరసింహ, కొండాపురం యాదగిరి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -