నవతెలంగాణ – డిచ్ పల్లి
అక్టోబర్ 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి, తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ , మున్సిపల్ వర్కర్ యూనియన్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి జే పి గంగాధర్ అన్నారు. శనివారండిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధం జీపీ కార్మికుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఐఎఫ్టియు, తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 2025 అక్టోబర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించ తలపెట్టామని అన్నారు. దీనికి జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికులు వాటర్ మెన్, ఎలక్ట్రిషన్ ,అటెండర్, సిబ్బంది ధర్నాకు తరలిరావాలన్నారు. అన్ని రంగాలలో కార్మికులు, వివిధ సెక్టార్లలో ఉన్న నాన్ టీచింగ్ కాంట్రాక్టర్, స్కీం వర్కర్స్ అన్ని రంగాలను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016 తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. బాకీ ఉన్న వేతనాలు, పిఎఫ్ ,ఈఎస్ఐ, పర్మినెంట్ రెగ్యులర్ చేయాలని ఐ ఎఫ్ టి యు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నర్సయ్య ,అంజన్న, సాయిలు, పోతన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
6న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES