Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeనిజామాబాద్నసురుల్లాబాద్ ప్రజల కల సహకారం

నసురుల్లాబాద్ ప్రజల కల సహకారం

- Advertisement -

ముస్తాబైన ప్రభుత్వ ఆసుపత్రి 
నవతెలంగాణ-నసురుల్లాబాద్ 

నసురుల్లాబాద్ మండల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి కావాలని విన్నపాలు, నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేస్తూ, నూతన భవనం నిర్మించడంతో 42 ఏండ్ల కల సహకారం అయింది. బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలంలో 26 గ్రామాలు, దగ్గరలో ఉన్న ఇతర మండల ప్రజలకు కనీస వైద్య ఆరోగ్య సౌకర్యాలు లేక ఇక్కడి ప్రాంత ప్రజలు బోధన్, నిజామాబాద్, బాన్సువాడ పట్టణాలకు తరలి వెళ్ళవలసి వస్తుంది. మారుమూల గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం లేక పట్టణాలకు వెళ్లలేక ఎందరో రోగులు మృత్యువాత పడ్డారు. ఇక్కడి ప్రాంత ప్రజల, నాయకుల, ప్రజాప్రతినిధుల విన్నపాలను మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తించి వైద్య ఆరోగ్య సేవల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నస్రుల్లాబాద్ గ్రామానికి ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేయించి. ప్రభుత్వ ఆసుపత్రి కి నూతన భవన నిర్మాణం కోసం 1కోటి 43 లక్షల నిధులను మంజూరు చేయించారు. నసురుల్లాబాద్ మండల చుట్టుపక్క గ్రామాల ప్రజల వైద్య ఆరోగ్య సేవలు అందించడకై ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసి, అన్ని రకాల సదుపాయాలతో, వైద్యులకు ఆరోగ్య సిబ్బందికి వైద్య సిబ్బందికి, మందుల నిల్వ కోసం, ఆపరేషన్ థియేటర్, మందుల నిల్వ గది యోగ గది ఇతర సదుపాయాలతో నూతన భవన నిర్మాణం పూర్తయింది. నేడు భవన నిర్మాణం పూర్తి కావడంతో ప్రభుత్వ ఆసపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 42 ఏండ్ల ప్రస్థానం గతంలో నసురుల్లాబాద్ లో వైద్య ఆరోగ్య సేవలు కొనసాగేవి, నసురుల్లాబాద్ గ్రామంలో కుటుంబ నియంత్రణ, ట్యూబెట్టమి, వ్యాక్సిప్టమి ఆపరేషన్లు కొనసాగుతుండేవి, 1983లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల కారణంగా నసురుల్లాబాద్ మండలం కావలసి ఉండగా బీర్కూర్ మండలం కొనసాగడంతో. ఆసుపత్రి భవనం నిర్మాణం కాలేదు. 1992 వరకు నా సురుల్లాబాద్ గ్రామంలో వైద్య ఆరోగ్య సేవలు అలాగే కొనసాగేవి ప్రభుత్వ వైద్యులు ఆరోగ్య సిబ్బంది వైద్య సిబ్బంది ఇక్కడే ఉండేవారు. కాలక్రమమైన బీర్కూర్ మండలం నూతనంగా ఏర్పడడం అక్కడే ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పడడంతో ఇక్కడున్న పోస్టులను అక్కడికి బదిలీ చేశారు. అప్పటినుంచి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి లేక ప్రజలు నానా అవస్థలు పడేవారు. గతంలో రోడ్డు మార్గం రవాణా మార్గం లేకపోవడంతో ఎందరో మంది రోగులు మూర్తి పాత పడ్డారు దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృషితో స్థలం కేటాయించి కోటి 43 లక్షల రూపాయలతో నూతన భవనం నిర్మాణం జరిగింది. నసురుల్లాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కు కృషిచేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ మాజీ ఎంపీపీ పాల్త్య విఠల్, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, మైసగౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ ,గ్రామ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు. వైద్యులను సిబ్బందిని నియమించాలి నసురుల్లాబాద్ మండలంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే వైద్యులను వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించాలని ఇక్కడి ప్రాంత ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే ఆసుపత్రిలో కావలసిన కనీస సదుపాయాలు వైద్యులు ఆరోగ్య సిబ్బంది మందులను సమకూర్చాలన్నారు. నోట్ ప్రభుత్వ ఆసుపత్రి కావాలంటూ గతంలో ప్రజాశక్తి, నవతలంగాణలో కథనాలు రాశాం దానికి ఎమ్మెల్యే స్పందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad