Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్పేదింటి డబుల్ బెడ్ రూమ్ కల కాంగ్రెస్ హయాంలో నెరవేరుతుంది

పేదింటి డబుల్ బెడ్ రూమ్ కల కాంగ్రెస్ హయాంలో నెరవేరుతుంది

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  :   పేదింటి బడుగు , బలహీన వర్గాల డబుల్ బెడ్ రూమ్ కల కాంగ్రెస్ హయాంలో నెరవేరుతుందని  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం నాడు జుక్కల్ మండల కేంద్రంలోని పలువురికి మంజూరైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల  ఇంటి నిర్మాణం కొరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నేడు ముగ్గు వేసి పనులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి ప్రతిరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు . ఇంటి నిర్మాణాలు చేసుకున్న లబ్ధిదారులకు వెనువెంటనే డబ్బుల చెల్లింపులు జరగాలని అధికారులకు సూచించారు . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిందని వాటికి సంబంధించిన నిధులు ప్రస్తుతం హౌసింగ్ శాఖలో నిల్వ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు రాజులు సెట్ , మార్కెట్ డైరెక్టర్ అనిల్ సెట్ , ఎంపీడీవో శ్రీనివాస్ , డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -