Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల సాకారం

- Advertisement -

రీజినల్‌, ఔటర్‌ రింగ్‌రోడ్ల అనుసంధానానికి రేడియల్‌ రోడ్లు : ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంతింటి కల సాకారం అవుతోందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజావ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లను అనుసంధానించడానికి వివిధ ప్రాంతాల్లో రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో మొట్టమొదటిగా 300 అడుగుల వెడల్పుతో రేడియల్‌ రోడ్లు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ మహానగరంతో పాటు ఫ్యూచర్‌ సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యంలో భాగంగా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పుతున్నట్టు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఏర్పడి నేటికి సరిగ్గా 47 ఏండ్లు పూర్తి అయిందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad