- Advertisement -
- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్పల్లి: పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఉప్లూర్ గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులు డాకూరి మంజుల శ్రీనివాస్, మగ్గిడి గంగమణి మల్లేష్ దంపతులను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను అందజేశారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు అవారి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



