Wednesday, March 25, 2026
E-PAPER
Homeజిల్లాలుఇందిరమ్మ రాజ్యం లోనే పేదింటి కల సాకారం అవుతుంది

ఇందిరమ్మ రాజ్యం లోనే పేదింటి కల సాకారం అవుతుంది

- Advertisement -


నవతెలంగాణ -పెద్దవూర
ఇందిరమ్మ రాజ్యం లోనే పేదింటి కల సాకారం అవుతుందని పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బట్టుగూడెం గ్రామ పంచాయతీ
పరిధిలోని కొత్త గూడెం గ్రామం జంగాల కాలానీలో నూతనంగా మంజూరై నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైనా ఏనాడైనా పేదల పక్షాన ఉంటుందని పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని అన్నారు.ఎన్నికలమేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను మంజూరు చేస్తూ పేదల పక్షాన నిలబడి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మానే ఉమాదేవి, ఎంపీఓ విజయ్ కుమార్,స్థానిక సర్పంచ్ మెండే ముత్యాలు,పంచాయతీ కార్యదర్శి పవిత్ర పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -