నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థి దశనుండే విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ సంబురాలను నిర్వహించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. ఆదివారం చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాల, ఆరోగ్య ఆహారపు అలవాట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరం వున్నచోట సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కోలా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో పాఠశాల స్థాయినుండే శాస్త్రీయ వైఖరులు పెంపోందించే విధంగా 8,9,10 తరగతుల విద్యార్థులకు చెకుముకి సంబురాలు పేరుమీద నవంబర్ 7 న పాఠశాల స్థాయి, నవంబర్ 21 న మండల స్థాయి, నవంబర్ 28 న జిల్లా స్థాయి, డిసెంబర్ 12,13,14 తేదీలలో కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి పరీక్షలు తెలంగాణ సమగ్ర శిక్షా విభాగం సహకారం తో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆ వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కట్టా మధుసూదన్, జిల్లా కోశాధికారి ఉస్మాన్ అలీ పాల్గొన్నారు.
శాస్త్రీయ సమాజం కొరకు జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



