Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ఎనిమిది ఏండ్ల అక్రమ కేసుకు నేటితో తెర…!

ఎనిమిది ఏండ్ల అక్రమ కేసుకు నేటితో తెర…!

- Advertisement -
  • – కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు
  • – హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు.
  • నవతెలంగాణ – మల్హర్ రావు
  • ఎనిమిదేళ్ల క్రితం అప్పటి మంథని ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తోపాటు పలువురిపై బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కేసు శనివారం నాంపల్లి కోర్టు కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడంతో మంత్రి శ్రీదర్ బాబు తోపాటు కాంగ్రెస్ నేతలు, మంథని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాఘవపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో 2017 ఆగస్ట్ 23న జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో పాల్గొని రైతుల తరపున విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నేతలపై,ఘర్షణ సృష్టించి అధికారుల విధులకు ఆటంకం కల్గించారని ఆరోపిస్తూ అప్పటి ప్రభుత్వం ఒత్తిడితో ఇరిగేషన్ అధికారులు దాదాపు 3వందల మంది నేతలు, రైతులపై ఫిర్యాదు చేశారు.ఈమేరకు బసంత్ నగర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ 1860 సెక్షన్ 147,186,427 ఆర్/డబ్ల్యూ 149 కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కార్ వేణు గోపాల్ రావుతో పాటు మరో 11 మందిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి పెద్దపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత కేసు విచారణ వాయిదాల అనంతరం కేసు హైదరాబాద్ నాంపల్లి లో గల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంకు 2023లో బదిలీ కాగా దాదాపు రెండు సంవత్సరాల విచారణ తర్వాత నేడు అట్టి కేసును కొట్టివేస్తూ గౌరవ న్యాయమూర్తి తీర్పును
  • ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇట్టి తీర్పు మంథని ప్రాంత రైతుల విజయం అన్నారు.ఇంత కాలం కేసు ఎదుర్కొన్న నేతలకు, కేసులో విజయం సాధించిన న్యాయవాద బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -