Saturday, September 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్‌ తీగలు తెగిపడి..

విద్యుత్‌ తీగలు తెగిపడి..

- Advertisement -

నవతెలంగాణ-హయత్‌నగర్‌
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై 11కేవీ విద్యుత్‌ తీగలు తెగి పడటంతో అక్కడికక్కడే సజీవ దహనమయిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఉన్న ఓ టెంపుల్‌ పక్కన ఒక పురుషుడు, ఒక స్త్రీ యాచకులు దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో 11 కేవీ విద్యుత్‌ తీగలు తెగి వారితో పాటుగా అక్కడే ఉన్న ఒక శనకంపై కూడా పడటంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్‌ ఆపేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -