Saturday, October 4, 2025
E-PAPER
Homeకవితనిత్య చైతశీలి వావిలాల గోపాలకృష్ణయ్య

నిత్య చైతశీలి వావిలాల గోపాలకృష్ణయ్య

- Advertisement -

ఆయన ఓ ఉదయించే సూర్యుడు
ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన మహా మనిషి
రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేసి
ప్రజా పోరాటంలో పాల్గొన్న చైతన్య శీలి
స్వాతంత్ర సమరయోధునిగానే కాదు
అధికారభాషా సంఘం తొలి అధ్యక్షునిగా
తెలుగు వెలుగుల్ని విశ్వవిశ్వ వ్యాపితం చేశారు
స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన చురకత్తిలాంటి పాత్ర ఆయనది
ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం
పలనాటి పుల్లరి ఉద్యమంలో జైలు శిక్ష
సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్రలతో
సోషలిస్టు నేతగా వినతికెక్కారు
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి
సమాజాభివద్ధిలో నిత్య చేతన్య శీలిగా
క్రియాశీలక పాత్ర పోషించారు
గాందేయవాదమే ఆయన జీవన వేదం
అందుకే ఆయన ఆంధ్ర గాంధీగా వినతికెక్కారు
నీతి నిజాయితీ నిరాడంబరతకు కేరాఫ్‌ అడ్రస్‌
ఈ మానవతావాది, నిత్య కషివలుడు
సమాజాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించడమే కాకుండా
దార్శనికత, దేశం పట్ల మమకారం, జాతి భవిష్యత్తు పట్ల
విశ్వాస పాత్రులుగా ఉన్న
వావిలాల గోపాలకృష్ణ గారి
జీవితం నేటి యువతకు
ఆదర్శం కావాలని కోరుకుంటూ
వావిలాల వారికి ఘనమైన జయంతి నివాళి

  • పింగళి భాగ్యలక్ష్మి, 9704725609
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -