Thursday, May 8, 2025
Homeఖమ్మంరైతు ప్రయోజనమే ప్రధానం…

రైతు ప్రయోజనమే ప్రధానం…

- Advertisement -

చట్ట సవరణతో బాధిత రైతులకు పరిహారం…
ఆయిల్ ఫెడ్ భరోసా ఇస్తేనే భవిష్యత్ సాగు విస్తరణ…
ఆయిల్ ఫాం గ్రోయర్స్ సమాఖ్య డిమాండ్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఆయిల్ పామ్ రైతుల శ్రేయస్సు ను పరిరక్షించడం, ఆయిల్ ఫెడ్ అభివృద్ధి, ప్రయివేటు శక్తులు, ఆయిల్ ఫెడ్ ను నిర్వీర్యం చేసేందుకు కొందరు అధికారులు పన్నే కుట్రలకు వ్యతిరేకంగా నిత్యం తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోవర్స్ సమాఖ్య పోరాడుతూనే ఉంటుంది అని ఆ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య లు ఉద్ఘాటించారు. మండలంలోని నారం వారి గూడెం సమీపంలో గల  ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వంద్యత్వ మొక్కల బాధితులు కు పరిహారం,వీటి స్థానంలో కొత్త మొక్కలు సాగు సాధ్యాసాధ్యాలు, బాధిత రైతుల పట్ల వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు,ఫాం ఆయిల్ నర్సరీ లో కాంట్రాక్ట్ నిర్వహణ వైఫల్యం,ఆయిల్ ఫాం విత్తన దిగుమతి లో అక్రమాలు, రేగళ్ళపాడు నర్సరీలో పెరిగిన నాసిరకం మొక్కలు వ్యవహారం, ఏజెన్సీలో ఆయిల్ ఫాం సాగు లో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు లాంటి అనే విషయాలు పై సుదీర్ఘంగా వివరించారు. ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి,ఆయిల్ పామ్ రైతుల శ్రేయస్సు కోసం సమాఖ్య ఈ క్రింది 9 సూచనలు ప్రభుత్వానికి, ఆయిల్ ఫెడ్ కు చేసింది.
అవి యదాతధం..
1.ఆయిల్ పామ్ కల్లింగ్ (రోగగ్రస్తం) మొక్కల వలన నష్టపోయిన రైతులను ఆయిల్ఫెడ్ నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆఫ్ టైప్ మొక్కలు రైతు ల తోటల లోకి వచ్చిన మాట నిజమే అని స్వయం గా తోటలలో పార్టీనుంచి ఒప్పుకొని,ఈ విధంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వటానికి ఆయిల్ పామ్ యాక్ట్ లో కానీ,సీడ్ యాక్ట్ లో కానీ, కన్స్యూమర్ యాక్ట్ మొదలగు ఏ చట్టం లో కూడా అవకాశం లేదని చెప్పటం ఆయిల్ పామ్ బాధిత రైతులను విస్మయానికి గురిచేసింది. దీనిని పునః పరిశీలించి బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించాల్సంది గా డిమాండ్ చేస్తున్నాము.
2.కల్లింగ్ మొక్కలు ఉన్న రైతులను ఆయిల్ ఫెడ్ వారు వాటిని పీకి కొత్త మొక్కలు వేసుకో మంటున్నారు.అసలు 5,6,7,8 సంవత్సరాల వయసు తోటలో కొన్ని మొక్కలు పీకి కొత్త మొక్కలు వేస్తే అవి నీడలో పెరిగే అవకాశం లేదు. మొత్తం తోట అంతా పీకి కొత్త మొక్కలు చేసుకోవాలన్న ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ వద్ద ఉన్న మొక్కలు మంచివే నా ? 28, 30 నెలల వయసు ఉన్న మొక్కలను అసలు నాటవచ్చా.? 
ఒక వేళ మళ్లీ కర్లింగ్ మొక్కలు వస్తె మూడు సంవత్సరాల తరువాత ఈ విధం గా వేసిన రైతుల పరిస్తితి ఏమిటి? వాటికి నష్టపరిహారం ఇవ్వలేము అని ఆయిల్ ఫెడ్ చైర్మన్ గారు చెబుతున్నారు గదా? కాబట్టి మేము రైతులను ఈ విధమైన మొక్కలను ప్రభుత్వం నుండి స్పష్టమైన విధాన పరమైన నిర్ణయం తీసుకునేంత వరకు వేచి చూడాలి అని బాధిత రైతులు గా విజ్ఞప్తి చేస్తున్నాము.
3.వ్యవసాయశాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు ఒక మీటింగ్ లో ఇకనుంచి ఎవరైనా తోటల్లో ఆఫ్ టైప్ మొక్కలు వస్తే కంపెనీల నుండి పూర్తి నష్ట పరిహారం దగ్గరుండి ఇప్పిస్తానని ప్రకటించారు. కాని ఆయిల్ ఫెడ్ లో కానీ, తెలంగాణ ఆయిల్ పామ్ యాక్ట్ లో కానీ అందుకు అవకాశం లేదు అని ఆయిల్ ఫెడ్ ఎండీ,ఆయిల్ ఫెడ్ చైర్మన్ చెబుతున్నారు.కాబట్టి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకొని ఆయిల్ పామ్ యాక్ట్ లో ఇకనుండి ఎవరి తోటల్లో అయిన ఆఫ్ టైప్ మొక్కలు వస్తే ఆ మొక్కలు ఇచ్చిన కంపెనీ నుండి సంబంధిత రైతుకు నష్టపరిహారం ఇచ్చేలా చట్ట సవరణ చేయాలి అని కోరుతున్నాము.
4.ఆయిల్ ఫెడ్ నర్సరీల్లో కాంట్రాక్టర్ వ్యవస్తను అడ్డుపెట్టుకొని కల్లింగ్ మొక్కలు రైతుల తోటలోకి రావటానికి కారణమైన 2015 – 2022 సంవత్సరాల మధ్య పనిచేసిన కాంట్రాక్టర్,అధికారుల పైన ఎంక్వైరీ చేసి బాధ్యులను ఆయిల్ ఫెడ్ నుండి తొలగించి నష్టాన్ని వారినుండి రికవరీ చేయాలని, ఇకపై అన్ని నర్సరీలు కాంట్రాక్టర్ వ్యవస్తను తొలిగించి గతం లో లాగానే ఆయిల్ ఫెడ్ స్వయం గా నర్సరీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గతం లో కూడా నర్సరీ ల నుండి మొక్కలను అమ్ముతుంటే పట్టుకుని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో, జనగాం నుండి మొక్కలు అమ్ము కుంటుంటే దానిని పట్టుకుని సత్తుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా దాని పై చర్యలు తీసుకోకపోవటం, నర్సరీ లో అవకతవకల పై గతం లో ఒక ఉద్యోగి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ 40 లక్షల రికవరీ కి ఆదేశించినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఆదే ఉద్యోగిని ఆయిల్ ఫెడ్ లో కీలక పోస్టు లో కొనసాగించటం, అదే అధికారి ఆ టైం లో సుమారు 60 లక్షల సీడ్ ను విదేశాలనుండి దిగుమతి చేయటం లో కీలక పాత్ర పోషించటం వంటి చర్యలు ఆయిల్ ఫెడ్ ఈ దుస్థితి కారణం అయి రైతుల కు నష్టం కలిగించారు. మరియు ఆయిల్ ఫెడ్ విదేశీ సీడ్ దిగుమతి లో కొంత మంది మధ్యవర్తులు కీలక పాత్ర పోషించి థర్డ్ క్వాలిటీ సీడ్ ను ఇంపోర్ట్ చేయటం మీద కూడా విచారణ జరిపి వ్యవస్తను ప్రక్షాళన చేయవలసినదిగా కోరుచున్నాము.
5.గత సంవత్సరం కాలం గా ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ విత్తనాలను దిగుమతి చేసుకోవటం లేదు, మరియు కొత్తగా ఆయిల్ పామ్ వేయాలనుకొనే రైతులకు ఇప్పుడు ఉన్న 28,30 నెలల వయస్సు ఉన్న మొక్కలు తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ కొత్త విత్తనాలతో ఫ్రెష్ నర్సరీ ప్రారంబించకపోతే వచ్చె సంవత్సరం ఆయిల్ పామ్ విస్తరణ సాధ్యం కాదు. కాబట్టి తగు చర్యలు వెంటనే ప్రారంభించాలి.
6.రేగళ్ల పాడు నర్సరీ లో మూడు లక్షల తంటా రకం జన్యులోపం ఉన్న మొక్కలను నాశనం చేస్తున్నారా ? లేక వాటిని రైతులకు ఇవ్వటానికి ఇంకా ప్రయత్నం చేస్తారా?
7.మన భద్రాద్రి కొత్తగూడెం గిరిజన ప్రాంతం లో చాలా మంది గిరిజన రైతులకు భూమి ఉండి పట్టాదారు పాస్ బుక్ లు వివిధ కారణాల వలన రాక, సామ్ ఆయిల్ వేయటానికి కుదరక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించి పామ్ ఆయిల్ మొక్కలు ఇచ్చినట్లు అయితే గిరిజనులు ఎక్కువుగా ఉన్న మండలాల్లో పామ్ ఆయిల్ విస్తీర్ణం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అని, దీని పై ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాము.
8.రైతులకు సంబంధించిన అనగా తోట వేసిన తేదీ, బ్రీడ్, బ్యాచ్ నెంబర్, విస్తీర్ణం, ఫ్రూట్ ఏ తేదీన ఎంత వచ్చింది, పేమెంట్ ఎంత వచ్చింది మరియు ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన సమగ్రం యాజమాన్య పద్ధతులు ఒక మొబైల్ యాప్ ద్వారా ప్రతి చూసుకునే విధంగా రైతులకు అందుబాటులో ఉండాలి.
9.రైతులకు మొక్కలు ఇచ్చేటప్పుడు డెలివరీ ఆర్డర్ పై పూర్తి సమాచారం అనగా మొక్క రకం, విత్తనం బ్యాచ్ నెంబర్, నర్సరీ లో నాటిన తేది, మొక్క వయసు లాంటి పూర్తి సమాచారం తో రైతు కు కూడా ఒక కాపీ ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. ఈ విలేకర్లు సమావేశంలో బాధిత రైతులు పుచ్చకాయల సోమిరెడ్డి,దొడ్డ చక్రధర్ రెడ్డి,చెలికాని సూర్యారావు,వెంకట్రావు,కారం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -