నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ ప్రభుత్వం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) మార్కెట్‌లోని పెద్ద సంస్థల ‘తారుమారు’పై మౌనంగా ఉండటం ద్వారా పెద్ద పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ, సాధారణ మదుపరులను నష్టాల పాలు చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ విమర్శించారు. ఎఫ్ అండ్ ఓ మార్కెట్లలోని లొసుగులను తాను ఊహించానని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘2024లోనే స్పష్టంగా చెప్పాను. ఎఫ్‌అండ్‌ఓ మార్కెట్ ‘పెద్ద పెట్టుబడిదారుల’ ప్లేగ్రౌండ్‌గా మారింది. చిన్న పెట్టుబడిదారుల జేబులు నిరంతరం ఖాళీ అవుతున్నాయి’ అని పేర్కొన్నారు. సెబి ఇప్పుడు జేన్ స్ట్రీట్ వేలకోట్లను తారుమారు చేసిందని అంగీకరిస్తోందని, ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ఆయన ప్రశ్నించారు. రాహుల్ తన పోస్టుకి 2024 సెప్టెంబర్ 21 నాటి పోస్టును ట్యాగ్ చేశారు. ఆ పోస్టులో రాహుల్ ‘నియంత్రణ లేని ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఐదేళ్లలో 45 రెట్లు పెరిగింది. 90 శాతం చిన్న పెట్టుబడిదారులు మూడేళ్లలో 1.8 లక్షల కోట్లు కోల్పోయారు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఎఫ్‌అండ్‌ఓ మార్కెట్ ‘పెద్ద పెట్టుబడిదారుల’ ప్లేగ్రౌండ్: రాహుల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES