Saturday, May 3, 2025
Homeఖమ్మం20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి..

20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి..

సీఐటీయూ ఆద్వర్యంలో సార్వత్రిక సమ్మె నోటీస్ లు అందజేత: సీఐటీయూ నాయకులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఈ నెల 20 న కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్ ల జాయింట్ ప్లాట్ ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపుపై సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పేపర్ బోర్డు, కెమీలాయిడ్స్, పామాయిల్ ఫ్యాక్టరీలలో సంబంధిత యాజమాన్యాలకు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాల ఫలితంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది అని అన్నారు. లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాలు ఏర్పాటు కష్టతరం అవుతుందని, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం అవుతుందని, ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారని కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. ఈ సార్వత్రిక సమ్మెలో 20 రకాల ప్రధానమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహించ బడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోడెం ప్రసాదు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img