Monday, March 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్‌ రెడ్డి

రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. “దేశం కోసం, మన అందరి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గత ఐదేళ్లుగా ఆయన చేసిన నిరంతర పోరాటాల ఫలితంగానే నేడు రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. దేశంలోని అనేక సమస్యలపై ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే మన తదుపరి లక్ష్యం కావాలి” అని స్పష్టం చేశారు.

తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.. తాను ZPTC నుండి సీఎం అయ్యాను అని తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 19 ఏళ్ల స్వల్ప కాలంలోనే ZPTC స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, ఎమ్మెల్యేగా, పార్టీలో వివిధ పదవుల్లో పనిచేసి ఎంతో అనుభవం గడించానని తెలిపారు. తన ప్రజా జీవితంలో ఎప్పుడూ పైరవీలకు తావివ్వలేదని, కేవలం ప్రజా సమస్యల పైన గళం వినిపించడమే తన పనిగా పెట్టుకున్నానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -