Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం

ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ – ఝరాసంగం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖాతాదారులకు ఈ కేవైసీ అందించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు – 2026 వాక్ థాన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యమని సంగారెడ్డి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు పేర్కొన్నారు. ఖాతాదారులకు, ప్రజలకు సురక్షితమైన బ్యాంకింగ్ అయితే అడుగులు వేసేందుకు జిల్లాలో ఐదు రోజులపాటు  అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్, డిసిసిబి బ్యాంక్ అధికారులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రజలకు సైబర్ నేరాల పట్ల, ఈకేవైసీ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ముందుగా విద్యార్థులతో మండల కేంద్రం నుండి కెనరా బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ యొక్క ప్రాథమిక అంశాలైన మనీలాండరింగ్, ఫైనాన్సింగ్, మోసం వంటి ఆర్థిక నేరాలు నిరోధించడానికి, కస్టమర్ గుర్తింపులను దృవీకరించడం, వాటిని ఎలా నియంత్రించాలనే అంశాలపై కాకుండా ఖాతాదారులకు, ప్రజలకు కేవైసీ పైన ఒక నమ్మకాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా ఆర్థిక సంస్థలు, నిజాయితీ గల కస్టమర్లను అక్రమ కార్యకలాపాల నుండి రక్షించడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా కేవైసీకి సంబంధించిన అవసరమైన పత్రాలను ఎలా సమర్పించాలి, కాలానుగుణంగా అనుసరించాల్సిన మార్గాలు, కేవైసీ అభ్యర్థన కోసం అందుబాటులో ఉన్న మోడ్లు ఏమిటి? సి కేవైసీ రిజిస్ట్రీ అంటే ఏమిటి? కేవైసీ ప్రక్రియను సులభతరం చేయడంలో కస్టమర్ల పాత్ర ఏమిటి? కేవైసీ స్థితి, సంఖ్యను ఎలా తనిఖీ చేయాలి అనే అంశాలపై వివరించారు. అంతేకాకుండా కేవైసీ సంబంధిత మోసాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? సైబర్ మోసాలకు బాధితులైతే వారు ఏం చేయాలి? మనీ మ్యూలింగ్ సంబంధిత మోసాల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం పౌర సమాజంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ మేనేజర్ రాజు, కెనరా బ్యాంక్ మేనేజర్ సునీల్ రెడ్డి, సొసైటీ సీఈవోలు నిసార్ అహ్మద్, సి ఎఫ్ ఎల్ కోఆర్డినేటర్లు రాజశేఖర్,విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -