నవతెలంగాణ – దుబ్బాక : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి లోని కూడవెల్లి రామలింగేశ్వరాలయాన్ని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మైనంపల్లి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. కూడవెళ్లి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ఆలయ చైర్మన్ ఉషయ్యగారి రాజిరెడ్డి, ఈవో శ్రీధర్ రెడ్డిలు శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి వెంట కాంగ్రెస్ మెదక్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,నాయకులు మహిపాల్ రెడ్డి, కొంగర రవి, వెంకటస్వామి గౌడ్, శ్రీనివాస్ కమలాకర్, మధు, నరేందర్, శంకర్, సురేష్, సుమలత పలువురున్నారు
పేదల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – మైనంపల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES