చందుర్తిలో రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – చందుర్తి
ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పెరుక కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదని విమర్శించారు. డబుల్ బెడ్రమ్ ఇచ్చిన దాఖలు లేవని తెలిపారు. ప్రజా పాలనలో ప్రగతి బాట తో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పేద వారికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతామని అన్నారు.
42%బిసి రిజర్వేషన్ బిల్లును 2018 చట్టం ప్రకారం సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ ఆమోదం తెల్పడం గర్వించదగ్గిందని అన్నారు. త్వరలో మోత్కురావు పేట రోడ్ కు మోక్షం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరా అధికారులు రజిత, శ్రీలత, తహశీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పిటిసి నాగంకుమార్, ఎంపీడీఓ రాధా నాయకులు పాల్గొన్నారు. విప్ మాట్లాడుతుండగా అధికారుల నిద్ర రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతుండగా జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీలత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి నిద్ర మత్తు లో మునిగిపోయారు. దీంతో చూసే వారు ఒక ఎమ్మెల్యే మాట్లాదుండగా నిద్ర పోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తోంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES