- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన కాంపెళ్లి మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని బీఎస్పీ కేంద్ర సమన్వయకర్త నిషాని రామచంద్రం డిమాండ్ చేశారు.తన వ్యవసాయ సాగు భూమిని రెడ్డి సామాజిక వర్గానికి తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ వద్ద కాంపెళ్లి మల్లయ్య కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసనకు నిషాని రామచంద్రం మద్దుతు తెలిపారు.పై అధికారుల అదేశాలు ఉల్లంఘించి అక్రమంగా పట్టా చేసిన తహసీల్దార్ పై అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని రామచంద్రం కోరారు.
- Advertisement -