Monday, October 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి

రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి

- Advertisement -

– బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న
నవతెలంగాణ -ముధోల్ 
: ముధోల్ మండలం లో ఆయా గ్రామాల్లో గత నాలుగు రోజులు క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన సొయా తో పాటు పత్తి,మొక్కజొన్న,వరి పంటలు పూర్తిగా నీట మునగడం తో రైతులు  నష్టపోయారని ముధోల్ మండల బిజెపి అధ్యక్షుడు కోరిపోతన్న ఆదివారం ఒక్క ప్రకటనలో ప్రభుత్వం ను కోరారు. చేతుకొచ్చే దశలో పంట నీట మునకటం తో రైతులు తీవ్రంగా నష్టపోయరని  ఆయన  పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని   లేని యేడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఆయా గ్రామాల్లో కోతకు గురికావడం తో రాకపోకలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు . తక్షణమే రోడ్లు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.వెంటనే ప్రభుత్వం  సర్వే చేయించి వర్షాలకు నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -