నవతెలంగాణ – మునుగోడు
మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాదని కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచ్ వెదిరే విజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆ గ్రామంలో మరో సంఘ బంధం భవనంకు 10 లక్షల నిధులు మంజూరు కావడంతో భవన నిర్మాణం కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తమ స్వంత భవనాలలో సమావేశాలు నిర్వహించుకోవడం, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకోవడం, మరియు సామాజిక ,ఆర్థిక సాధికారతను పెంచడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిసి మల్లీశ్వరి , గ్రామ కార్యదర్శి ఉప్పునూతల స్వామి , గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సంఘభంధం అధ్యక్షురాళ్ళు, వివోఏ లు, మహిళలు , గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



