నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ, తమిళనాడు గవర్నర్ల మాదిరిగానే కర్నాటక రాష్ట్ర గవర్నర్ వ్యవహరించారు. రేపు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంప్రదాయబద్ధంగా చేయాల్సిన ప్రారంభోపన్యాసం చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) నిరాకరించారు. మొదటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే రేపు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రసంగం చేసేందుకు గవర్నర్ విముఖత చూపినట్లుగా సమాచారం.
మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సీఎం ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని, గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.



