నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని మహంతం గ్రామంలో శ్రీ పెద్ద పోచమ్మ, శ్రీ భూ లక్ష్మమ్మ, శ్రీ ఐదు చేతుల పోచమ్మ, శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ మారేడమ్మ మరియు పోతరాజు దేవాలయ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ మరియు శశాంక్ జోషిలు శనివారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని కులాల సభ్యులు అంతా కలిసి ఈ దేవాలయాల ప్రతిష్టాపన మహోత్సవాలను 6 వ తేదీ నుండి హోమాలు, యజ్ఞలు మరియు విశేష పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పెద్ద పోచమ్మ, శ్రీ భూలక్ష్మి దేవతల గుడులను మాజీ ఉపసర్పంచ్ పల్లికొండ పోశెట్టి సొంత నిధులతో నిర్మించగా విగ్రహాలను శ్రీ యనమల సుబ్బమ్మ వెంకటరెడ్డి గార్ల జ్ఞాపకార్థం కుమారుడు వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు విగ్రహాలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులతో పాటు ఆయా గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంగెం శ్రీనివాస్, మాజీ సర్పంచులు మేకల దేవిదాస్, మేకల రాజేశ్వర్, బండ్ల రాములు, ఆలయ కమిటీ సభ్యులు నీరడి భూషణ్, సంగెం శ్రీనివాస్, సుంకరి రాజు, మెట్టు రాజేశ్వర్, బాగా శ్రీనివాస్, బాల్ రెడ్డి, మెట్టు కిషోర్, రమణ మరియు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
మహాంతంలో ఘనంగా దేవాలయ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



