నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా కు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మంజూరు కావడం, మన ములుగు జిల్లా ముద్దు బిడ్డ మంత్రి సీతక్క గారి ఆలోచన, కృషి ఫలితమేనని, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చెర్ప రవీందర్ అన్నారు. ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామం లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తో ఎనకాపడ్డ ములుగు జిల్లా పారిశ్రామికంగా ముందు కు పోవడానికి అవకాశం ఉంది అని, వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశం ఏర్పడుతుంది అని అన్నారు. ములుగు జిల్లా నె కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులందరికి ప్రయోజనం కలుగుతుంది అని ములుగు జిల్లా లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మంజూరు చేయించిన మంత్రి సీతక్క గారికి ఈ ప్రాంతం రుణపడి ఉంటాది అని తెలిపారు.
మంత్రి సీతక్క కృషి ఫలితమే ములుగు జిల్లా కు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES