Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeసినిమామనసుని కదిలించే 'అనగనగా కథ'

మనసుని కదిలించే ‘అనగనగా కథ’

- Advertisement -

ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌-ప్యాక్డ్‌ డ్రామా చిత్రం ‘కుబేర’. తాజాగా రిలీజ్‌ చేసిన సెకండ్‌ సింగిల్‌ ‘అనగనగ కథ..’ సినిమా పవర్‌ఫుల్‌ మోరల్‌ కోర్‌కి పర్ఫెక్ట్‌ మ్యూజిక్‌ ప్రజెంటేషన్‌ని అందించింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలని పెంచుతూ ఈ కొత్త పాట సినిమా సారాంశాన్ని తెలిపింది.
ఇది దురాశ, అవినీతి మధ్యలో చిక్కుకున్న దుర్బలమైన మానవత్వం ఇతి వత్తాలతో అందరికీ డీప్‌గా కనెక్ట్‌ అయ్యే సాంగ్‌ ఇది. దేవి శ్రీ ప్రసాద్‌ మనసుని కదిలించే ట్రాక్‌గా దీన్ని కంపోజ్‌ చేశారు.
గీత రచయిత చంద్రబోస్‌ ఆర్థిక అసమతుల్యత, డబ్బు, అవినీతి ప్రభావం వంటి సమస్యలను పరిష్కరించడానికి లోతైన పదాలతో అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది.
ఈ పాట నైతిక దిక్సూచిగా ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతోంది. హైదే కార్తీ, కరీముల్లా వోకల్స్‌ ట్రాక్‌కు మరింత ఎనర్జీ నింపాయి. ధనుష్‌, నాగార్జున డిఫరెంట్‌ అవతార్స్‌లో కనిపించడం ఆకట్టుకుంది. వారి ఎక్స్‌ప్రెషన్స్‌ డిఫరెంట్‌ ఐడియాలజీని ప్రజెంట్‌ చేస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, జిమ్‌ సర్బ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 20న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad