నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్దగుల్లా తండాలో శనివారం నాడు విద్యుత్ ఘాతంతో మరణించిన తల్లి కూతురు మృతి చెందిన సంఘటన జుక్కల్ మండలం ఉపాధ్యాయులు మనస్సు ను కాల్చివేసిందని ఉపాధ్యాయ సంఘం నేతలు వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడుతూ గుల్ల తాండా నుంచి నిత్యం పాఠశాలకు వచ్చి పెద్దగుల్ల లో నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చౌహాన్ శ్రీవాణి ఎప్పుడు చాలాకిగా ఉంటూ విద్యలో ముందుండేదని చదువుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు అందరితో కలిగోడుగా ఉండి గమ్మత్తుగా మెలిగేదేమి ప్రస్తుతము మృతి చెందడంతో జానకి పిల్ల కనబడకుండా పోతుందని తమకు చాలా బాధగా ఉందని పెద్ద గుల్లా ప్రభుత్వ పాఠశాల లో విద్యబోధించె ఉపాధ్యాయులు , మండల ఉపాధ్యాయుల సంఘం నేతలు పేర్కొన్నారు . ఆమె మృతికి ఉపాధ్యాయులంతా 5 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి మరయు సంతాపం తెలిపారు.
శ్రీవాణి విద్యార్థిని విద్యుత్ ప్రమాదంలో చెందిన సంఘటన తమ మనసులను కుదిపేసింది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES