Wednesday, May 14, 2025
Homeబీజినెస్ఒక్క పూటలో లాభాల ఆనందం ఆవిరి

ఒక్క పూటలో లాభాల ఆనందం ఆవిరి

- Advertisement -

– సెన్సెక్స్‌ 1,282 పాయింట్ల పతనం
ముంబయి: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం దూసుకెళ్లిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. భారీ లాభాలను పొందామని ఆశించామన్న సంతోషం ఒక్క పూటలోనే ఆవిరయ్యింది. అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడంతో ప్రపంచ మార్కెట్లు రాణించగా.. దీనికి భిన్నంగా భారత్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,281.68 పాయింట్లు లేదా 1.5 శాతం పతనమై 81,148.22కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 346.35 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో 24,578 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 24,600 స్థాయి దిగువకు చేరింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్బీఐ, టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రమే లాభపడగా.. ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -