Thursday, July 17, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ వేదిక‌గా ఏపీ, తెలంగాణ‌ సీఎంల కీల‌క‌ భేటీ

ఢిల్లీ వేదిక‌గా ఏపీ, తెలంగాణ‌ సీఎంల కీల‌క‌ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమైయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశ ఎజెండాలో గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంశం పక్కన పెట్టాలని నిన్న ( జూలై 15న) జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో లేఖ రాశారు. తాజా భేటీతో బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఓ నిర్ణ‌యానికి రానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -