Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆ ప‌థ‌కానికి ఆగ‌ష్టు 13 చివ‌రి తేదీ

ఆ ప‌థ‌కానికి ఆగ‌ష్టు 13 చివ‌రి తేదీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా, పసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం రైతు బీమా పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన పథకాల్లో ఒకటైన ‘రైతు బీమా’కు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఆగస్ట్‌ 13. ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం రైతులకు సూచించింది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్‌ పొందిన రైతులు, అలాగే గతంలో పాస్ బుక్‌ ఉన్నప్పటికీ ఈ స్కీమ్‌లో చేరని వారికి కూడా అవకాశం ఇస్తోంది. ఆగస్ట్‌ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -