నవతెలంగాణ – మల్హర్ రావు:
‘దేవుడు వరమిచ్చినా పూజారి..కనికరించలేదన్నట్లుoది.మండల వివిధ రాజకీయ పార్టీల నాయకుల పరిస్థితి.జెడ్పిటిసి,ఎంపిటిసి,ఎంపిపి,సర్పంచ్ పదవులపై ఆశలు పెంచుకున్న పలువురు కాంగ్రెస్,బిఆర్ఎస్ నాయకులకు సొంత గ్రామాల్లో రిజర్వేషన్లు అనుకూలించలేదని తెలుస్తోంది.బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో నాయకుల అంచనాలు,జాతకాలు తారుమారై,వారి ఆశలు ఆడియాశలై అవిరైయ్యాయి.అనాదిగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినవారు పదవులపై ఆశలు పెంచుకొన్న వారికి రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి.కాగా ఖచ్చితంగా పార్టీ ఎవరినైనా ఎంపిటిసి అభ్యర్థిగా భావిస్తే వారికి అనుకూలమైన మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.ఈ సారి ఎలాగైనా పదవులను దక్కించుకోవాలనుకునే నాయకుల అంచనాలు తలకిందులైయ్యాయి. జెడ్సీటీసీ,ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు బిసి,ఓసి నాయకులకు సొంత గ్రామాల్లో ప్రతికూల రిజర్వేషన్లు రావడంతో వారు ఆందోళనకు గురైయ్యారు
నాయకుల అంచనాలు తారుమారు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES