Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅయ్యప్ప మాలలో ఉంటూ బీర్ తాగిన స్వామి..వీడియో వైరల్‍

అయ్యప్ప మాలలో ఉంటూ బీర్ తాగిన స్వామి..వీడియో వైరల్‍

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు మాల ధారణ చేయడం మనందరికీ తెలిసిందే. ఎంతో పవిత్రతో, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష కోసం మాలధారణ చేస్తూ అయ్యప్పపై తమ భక్తిని చాటుకుంటుంటారు. అలాంటి అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి మద్యం తాగుతూ అడ్డంగా తొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీంతో సదరు వ్యక్తిపై నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‍లో జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో అయ్యప్ప మాల ధరించి ఉన్న ఓ వ్యక్తి గదిలో రహస్యంగా బీర్ తాగుతుండగా తోటి స్వాములు పట్టుకున్నారు. ఇదంతా వీడియో తీశారు. గదిలో కూర్చుని బీర్ తాగుతుండగా రూమ్‍లోకి వచ్చిన మిగతా స్వాములను చూసి సదరు స్వామి ఒక్కసారిగా కంగారుపడిపోయాడు. తోటి స్వాములను చూడగానే ముఖాని దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అతడిని బయటకు వెళ్లకుండా ఆపేసిన తోటి స్వాములు.. మనిషివా పశువువా? ఇదేం బుద్ధి తక్కువ వ్యవహారం? మద్యానికి దూరంగా ఉండలేకపోతే మాల తీసేయాలి. అంతే తప్ప ఇదా పద్దతి? అంటూ మండిపడ్డారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిష్ఠగా ఉండలేనప్పుడు ఎదుకు మాల వేయడం మిమ్మల్ని ఎవరూ బలవంతంగా ఉండమనలేదు కాదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, స్వామి మాల విలువ తీస్తున్నారు సిగ్గుండాలని మరో నెటిజన్ మండిపడ్డారు. కొంత మంది వల్ల నిష్ఠతో ఉండే మిగతా స్వాములకు అవమానం తెస్తున్నారని మరో నెటిజన్ విమర్శించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -