Thursday, February 5, 2026
E-PAPER
Homeకరీంనగర్మున్సిపాలిటీలోని మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి : డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

మున్సిపాలిటీలోని మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి : డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- వేములవాడ-రాజన్న సిరిసిల్ల జిల్లా : మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మున్నూరు కాపు భవన్ లో రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాదిగ హక్కుల దండోరా ముఖ్య నాయకులు కార్యకర్తలు.మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారు మరియు అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ గారి ఆధ్వర్యంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో జరగబోయే ఎన్నికల్లో మాదిగ కులస్తులందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, దళిత వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
మాదిగల హక్కులు, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. ఈ ఎన్నికల్లో మాదిగల ఓటు కీలకమని, అందరూ బాధ్యతగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో పలువురు రాష్ట్రస్థాయి నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని మాదిగల ఐక్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో అందే భవాని , కవ్వంపల్లి రవీ, కూడెల్లి ప్రవీణ్ కుమార్, సప్పి పోశయ్య, ఎలుకంటి జనార్ధన్, బొడ్డు రాములు , కృష్ణ పెల్లి రాజలింగం, జంగాపల్లి రాజనర్స్, చిలక రాజేష్, తాటిపల్లి బాబు, గాలి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -