Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్యుగపురుషుడు ఎన్టీఆర్...

యుగపురుషుడు ఎన్టీఆర్…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
యుగపురుషుడు, కారణ జన్ముడు వంటి పదాలు చాలా బరువైనవి. అవి ఓ వ్యక్తికి అతికినట్లుగా సరిపోవడం స్వర్గీయ ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లిందని తెలుగుదేశం పార్టీ  జన్నారం మండల అధ్యక్షుడు  ఉప్పుల విజయ్  పార్లమెంటు నియోజకవర్గ నాయకులు  పులి శెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్  జయంతి సందర్భంగా జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు  తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నటుడిగా, రాజకీయ నాయకుడిగా అత్యంత విజయవంతమైన ప్రస్థానం ఆయనదన్నారు. ఒకానొక సమయంలో అభిమానులు ఆయన్ను దైవ స్వరూపుడిగా కొలిచారంటే అతిశయోక్తి కాదు. నటనలో శిఖరాల్ని అధిరోహించిన ఎన్టీఆర్, 9 నెలల్లోనే టీడీపి ని అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయాల్లోనూ లెజెండ్గా నిలిచారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అహర్నిశలు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన మహా నాయకుడు అన్నారు. అలాంటి మహానాయకుని స్మరించుకోవడం ఎంతో అవసరం అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, గొల్లపల్లి ప్రసాద్ పట్టణ అధ్యక్షులు ముత్యం పెళ్లి నవీన్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి హరీష్ స్వరాజ్ నాయక్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad