Thursday, October 23, 2025
E-PAPER
HomeఆటలుIND vs WI : తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌

IND vs WI : తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ: అహ్మదాబాద్‌ వేదికగా టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌ జట్లు పోటీపడుతున్నాయి. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం, టీమ్‌ఇండియా తన బ్యాటింగ్‌ ప్రారంభించిన కాసేపటికి ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఇరు జట్లు, అంపైర్లు మైదానాన్ని వీడారు.

కొన్ని నిమిషాల అనంతరం వర్షం ఆగిపోవడంతో అంపైర్లు తిరిగి ఆటను ప్రారంభించారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ జట్టు 162 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా రాణించారు. టీమ్‌ఇండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (4), కేఎల్‌ రాహుల్‌ (18) తిరిగి క్రీజులోకి వచ్చారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా స్కోర్‌ 12.4 ఓవర్లకు 23 పరుగులు చేసింది. భారత జట్టు మరో 139 పరుగులు వెనకబడి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -