నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గాం ఉగ్రదాడితో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇటీవలె త్రిదళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతతో పాటు, రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే..ముందు జాగ్రత్తగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యుద్ధ సన్నద్ధతలో భాగంగా త్రిదళాలతోపాటు దేశ పౌరులకు వార్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈక్రమంలో ఇవాళ పలు రాష్ట్రాలు సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాయి. యుద్ధ సన్నద్ధతలో భాగంగా పౌరులకు మాక్ డ్రిల్ పై యూపీ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వైమానిక దాడి సైరన్ పరీక్షను కూడా నిర్వహించారు. యుద్ధం సంభవిస్తే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లక్నోలో పోలీసులు పలు రిహార్సల్స్ చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పౌరులకు పోలీసులు సూచించారు. అదే విధంగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విపత్తు దళాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టారు. శ్రీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో యుద్ధ సన్నద్ధతపై స్థానికులకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో పడవ బోల్తా పడటం వంటి పరిస్థితుల్లో ఏ ప్రజలు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు రిహార్సల్స్ చేసి చూపించారు.
ముమ్మరంగా కొనసాగుతున్న సివిల్ మాక్ డ్రిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES