- Advertisement -


నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని నదులు, వాగులు, వంగలు, చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు అకాల వర్షాలకు అనేక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. చేనుల్లో వర్షం నిల్వగా, పలు పంటలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. అదే విధంగా బలమైన ఈదురుగాలులకు పంటచేనులు నేలకూలాయి. ఆరుగాలం కష్టపడించిన పంట నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










- Advertisement -


