ఛేదించిన పోలీసులు
ఐదుగురు అరెస్టు, పరారీలో ఒకరు : డీసీపీ
నవతెలంగాణ-చంపాపేట్
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కేతావత్ చందు నాయక్ రాథోడ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న హైదరాబాద్ మలక్‌పేట్ శాలివాహననగర్‌లో జీహెచ్‌ఎంసీ పార్క్ వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న చందును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురిని సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. గొడవలు, ఆర్థిక లావాదేవీలు హత్యకు దారితీసినట్టు విచారణలో వెల్లడైంది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్, సౌత్‌ఈస్ట్‌జోన్ పోలీసులు, మలక్‌పేట్ డివిజన్ సిబ్బంది 25 మందికి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీలు కె.సుబ్బరామిరెడ్డి, వెంకట్‌రెడ్డి, సీఐలు చంద్రమోహన్, పి.నరేష్, డీఐ జయశంకర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఐ నాయకుడి హత్య కేసును
- Advertisement -
- Advertisement -