– మండలంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పైన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు మండలంలోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలపై మువ్వన్నెల జెండా అధికారులు ఎదురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, తాసిల్దార్ కార్యాలయం పైన ఎమ్మార్వో మారుతి, జుక్కల్ పోలీస్ స్టేషన్ పైన ఎస్సై నవీన్ చంద్ర, ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రి పైన మెడికల్ ఆఫీసర్ విట్టల్, వ్యవసాయ కార్యాలయం పైన ఏవో మహేశ్వరి, పంచాయతి రాజ్ కార్యాలయం పైన మధుబాబు, ఈజీఎస్ కార్యాలయం పైన ఏపీఓ తులసి రామ్ , మండల విద్యాశాఖ కార్యాలయం పైన ఎంఈఓ తిరుపతయ్య , జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయం పైన జిపి సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రికి పైన వెటర్నరీ వైద్యుడు పండరి, కోఆపరేటివ్ సొసైటీ పైన కార్యదర్శి బాబురావు , ఇందిరా క్రాంతి కార్యాలయం పైన ఏపిఎమ్ , జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమాలలో ఆర్ఐ రాంపటేల్, ఎంపీ ఓ రాము, పి ఆర్ ఏ ఈ శ్రీకాంత్, ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది అనిల్, గంగాధర్, ప్రవీణ్ , భూమా గౌడ్ , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నీలు పటేల్ , తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలపై రెపరెపలాడిన జాతీయ జెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES