Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పాలకవర్గం గ్రామాల్లో నూతన పనులకు శ్రీకారం

నూతన పాలకవర్గం గ్రామాల్లో నూతన పనులకు శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి : గ్రామాల్లో కొలువుదిరిన నూతన పంచాయతీ పాలకవర్గం ఉత్తేజంతో పనులు చక్కబెట్టుతున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రములోని నూతన పాలకవర్గం అంత యువకులు కావడంతో సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ఎన్నికల్లో గ్రామస్థులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామములో ఏదోఒక చోట అభివృద్ధి పనులు చేస్తూ గ్రామస్థుల మన్ననలు పొందుతున్నారు. పూర్తి స్థాయి పాలకవర్గం యువతకే పట్టం కట్టడం కట్టారు. ఇలాగే ఎల్లవేళలా గ్రామముపై అభివృద్ధి పై దృష్టి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలని కోరుట్టిన్నారు. మొన్న గోసంగి కాలనిలో మంచినీటి సౌకర్యం, కాలనిలో రోడ్డు పనులకు శంకుస్థాపణలు చేశారు. గురువారం ఎన్టిఆర్ కాలనిలోని నీటి ట్యాంక్ వద్ద నీటి సమస్య ఉందని తెలుసుకొని పంచాయతీ నిధులతో బోరు వేయించారు. తమ త్రాగు నీటి సమస్య పరిశ్రయించినందుకు కాలనీ వాసులు పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -