Monday, June 30, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త లవ్‌ ఎంటర్‌టైనర్‌

సరికొత్త లవ్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

అంకిత్‌ కొయ్య, మానస చౌదరి హీరో, హీరో యిన్లుగా యూజీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందు తున్న చిత్రానికి ‘లవ్‌ జాతర’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘సమ్మతమే’ ఫేమ్‌ డైరెక్టర్‌ గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రొడ్యూసర్‌ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే టైటిల్‌కు తగినట్లే కంప్లీట్‌ రోలర్‌ కోస్టర్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఇప్పటివరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే మా సినిమా కచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుంది. కథాకథనాలు, నటీనటుల నటన, సంగీతం.. ఇలా అంశాన్ని తీసుకున్నా చాలా వైవిధ్యంగా ఉంటూ ప్రేక్షకులకు ఓ ఫ్రెష్‌ ఫీలింగ్‌ని అందిస్తాయి’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ త్వరలోనే మేకర్స్‌ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ – సుజాత సిద్ధార్థ్‌, మ్యూజిక్‌ – చేతన్‌ భరద్వాజ్‌, ప్రొడ్యూసర్‌ – కంకణాల ప్రవీణ, రచన, దర్శకత్వం – గోపీనాథ్‌ రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -