- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గత పదేళ్లలో భారతదేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య రెట్టింపు అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల వినియోగం పెరగడంతో అక్కడ కూడా పెట్రోల్ బంకులు అధికంగా ఏర్పడ్డాయి. దీంతో అమెరికా, చైనా తర్వాత అత్యధిక పెట్రోల్ బంకులు కలిగిన దేశంగా భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2025 నవంబర్ నాటికి పెట్రోల్ బంకుల సంఖ్య లక్షా 266కి చేరనుంది. ప్రస్తుతం, మూడింట ఒక వంతు బంకులు CNG, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. గత పదేళ్లలో పెట్రోల్ వినియోగం 110%, డీజిల్ డిమాండ్ 32% పెరిగింది.
- Advertisement -



