Thursday, May 1, 2025
Homeజిల్లాలుఅంగన్వాడిలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి..

అంగన్వాడిలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి..

  • బడిబాటలా డ్రైవ్ చేపట్టాలి..
  • – జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
    అంగన్వాడీలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని, నాణ్యమైన విద్య అందించాలని, బడిబాటలాగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ని మహిళాశిశు సంక్షేమ శాఖను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి కొండాపురం నర్సింహారావు ఆధ్వర్యంలో   పదవి విరమణ చెందుతున్న ఐ.సి.డి.ఎస్. ఉద్యోగులైన ఏసీడీపీఓ కె.రమ, సూపర్వైజర్ డి.ఊర్మిళ లను కలెక్టర్  శాలువా కప్పి ఘనంగా సన్మానిస్తూ, శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిరుపేదల పిల్లల సంక్షేమం కోసం అంగన్ వాడి కేంద్రాలకు రూపకల్పన చేసిందని,  పరిపూర్ణ వంతమైన ఆరోగ్యాన్ని అందించాలనే దృఢమైన సంకల్పంతో అంగన్ వాడి కేంద్రాలను నిర్మిస్తున్నదని, సంక్షేమ ఫలితాలు రాబట్టేందుకు, సత్పలితాలను అందించేందుకు శాఖ సిబ్బంది బాధ్యత తో పనిచేయాలన్నారు. అంగన్ వాడిలను బలోపేతం చేయడమే కాకుండా పునఃర్జీవనం కల్పిస్తూ చిన్నారుల సంఖ్య పెంచేందుకు  విద్యతో పాటు ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఆకట్టుకొని, నిర్విరామంగా అంకిత భావంతో పనిచేయాలన్నారు. అంగన్ వాడి కేంద్రాలు చిన్నారుల ఆటపాటలతో విద్యలో రాణించాలన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img