Monday, June 16, 2025
E-PAPER
Homeఆటలుఆరంభ మ్యాచ్‌ 0-0తో డ్రా

ఆరంభ మ్యాచ్‌ 0-0తో డ్రా

- Advertisement -

మయామి (యుఎస్‌ఏ): ఫిఫా 2025 క్లబ్‌ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ గోల్‌ లేని డ్రాగా ముగిసింది. ఇంటర్‌ మయామి, అల్‌ అహ్లీ తలపడిన తొలి మ్యాచ్‌లో లియోనల్‌ మెస్సి, లూయిస్‌ స్వారేజ్‌ చెమటోడ్చినా.. ఆతిథ్య ఇంటర్‌ మయామి గోల్‌ కొట్టలేకపోయింది. 56 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్నా మెస్సీ సేనకు నిరాశ తప్పలేదు. ఈజిప్ట్‌ క్లబ్‌ అల్‌ అహ్లీ పాస్‌ల కచ్చితత్వం సహా గోల్‌పోస్ట్‌పై దాడిలో మెస్సీ జట్టుపై పైచేయి సాధించింది. 90 నిమిషాల ఆట తర్వాతి ఇరు జట్లు గోల్‌ చేయటంలో విఫలం అయ్యాయి. 0-0 డ్రాతో ఇరు జట్లు చెరో పాయింట్‌ పంచుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -