Friday, October 3, 2025
E-PAPER
Homeజిల్లాలుమహనీయుల మార్గం ఆదర్శ‌ణీయం

మహనీయుల మార్గం ఆదర్శ‌ణీయం

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: మహాత్మ గాంధి, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో గల ఆ మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహాత్మ గాంధి అహింస మార్గం లో దేశానికి దేశానికి ఎలాగైతే స్వాతంత్య్రం తీసుకువచ్చారో అదేవిధంగా అహింసా మార్గం లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఉద్యోగ ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న 6 డిఎ లు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసిటియు జిల్లా గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, రాష్ట్ర గౌరవ సలహాదారులు రమణ స్వామి, బిసి నాయకులు పోతన్ కర్ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -